మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్లో ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేసే యువకుడికి మరో జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమయింది. పెద్దల సమక్షంలో అన్నీ మాట్లాడుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సూచించినట్టుగా, కొవిడ్-19 నిబంధనల ప్రకారం తక్కువ మందితో పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకుకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిపే కంటే.. వాయిదా వేసుకోవడం ఉత్తమం అనుకున్నారు.
పెళ్లి నిశ్చయమయింది.. కరోనా వచ్చి ఆగింది! - మహబూబాబాద్ జిల్లా వార్తలు
పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయమయింది. కొవిడ్-19 నిబంధనల ప్రకారం తక్కువ మందితో పెళ్లి జరిపించేందుకు ఇరు వైపు బంధువులు ఒప్పుకొన్నారు. పెళ్లికి తేదీ కూడా నిర్ణయించారు. తీరా.. పెళ్లి తేదీ సమీపించాక వరుడికి కరోనా అని తేలింది. చేసేదేం లేక తప్పనిసరి పరిస్థితుల్లో వధూవరుల బంధువర్గాలు పెళ్లి వాయిదా వేసుకున్నారు.
ఇరు వైపులా పెద్దలు నిర్ణయం తీసుకొని పెళ్లి వాయిదా వేశారు. ఈ సమాచారాన్ని బంధువులకు అందించారు. పెళ్లి వాయిదా పడిన విషయం తెలియని కొందరు బంధువులు పెళ్లి సమయం కల్లా కల్యాణ వేదిక వద్దకు వచ్చారు. విషయం తెలుసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. పెళ్లి తంతంగం ముగియకముందే.. పెళ్లి కొడుకు ఇలా బయట తిరుగుతున్నాడని చుట్టు పక్కల వాళ్లు ఆరా తీయగా..వరుడికి కరోనా సోకడం వల్ల పెళ్లి వాయిదా పడిన విషయం బయటపడింది.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు