కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలనూ నిలిపి వేసి.. రైతుబంధు నిధులను విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాబడి పూర్తిగా తగ్గిపోయినప్పటికీ రైతులకు రూ.7 వేల కోట్లను విడుదల చేశారన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్‌తో కలిసి ఆమె హాజరయ్యారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్‌గా బజ్జురి ఉమ, వైస్ ఛైర్మన్‌గా మురళి, పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తెరాస కార్యకర్తలందరూ భారీ ర్యాలీగా మార్కెట్‌కు చేరుకున్నారు.