రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహబూబాబాద్ జిల్లాలో అధికారులు కట్టదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలను సేకరించి వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలుపుతున్నారు. వారి ఇండ్ల వద్దకు వెళ్లి 14 రోజుల పాటు క్వారంటైన్ లేదా స్వీయ నిర్బధంలో ఉండాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు. మురుగు కాలువలు, కాలనీల్లో మందులను పిచికారి చేపిస్తున్నారు.
మహిళా సంఘాలచే మాస్కుల తయారీ - Manufacture of masks by women's associations
మహబూబాబాద్ జిల్లాలో కొవిడ్-19 వైరస్‌పై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను దండోరా, మైక్‌ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. మాస్కుల కొరతపై మహిళా సంఘాలకు 50 వేల మాస్కులను తయారు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు.
మార్కెట్లో మాస్కుల రేటు పెరిగిపోవడం, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం వల్ల మాస్కుల కొరత ఏర్పడింది. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మాస్కుల కొరత తీవ్రంగా ఉందని గ్రహించారు. అందుకు పరిష్కార మార్గంగా జిల్లాలోని మహిళా సంఘాలకు 50 వేల మాస్కులను తయారు చేయాలని సూచించారు. మహిళలు తమ సంఘాల ఆధ్వర్యంలో మాస్కులు కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. మహిళలు అన్ని పనులను వదిలి పెట్టి మాస్కులు కుడుతూ తమ వంతు బాధ్యతగా కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చూడండి :నేడు భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం