గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి, సర్పంచ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఓ వ్యక్తి వాటర్ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని రామానుజపురంలో చోటుచేసుకుంది.
'సర్పంచ్‌పై చర్యలు తీసుకోండి' - మహబూబాబాద్
దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామ పంచాయతీలో అవినీతి జరుగుతోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. విచారణ చేపట్టి సర్పంచ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వాటర్ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు.

'సర్పంచ్‌పై చర్యలు తీసుకోండి'
స్థానికుడు యాకయ్య.. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్‌ను, సర్పంచ్ తన సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించాడు. గ్రామ పంచాయతీ నిధులు, ఖర్చు వివరాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు