వివాహ బంధంతో రెండు కవల జంటలు ఒక్కటైన అపురూప ఘట్టమిది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి ఆ అరుదైన ఘట్టానికి వేదికైంది. వెంకటగిరికి చెందిన అంబాల మల్లికార్జున్, సుజాత దంపతులకు మహేశ్, నరేశ్ కవల పిల్లలు. మహేశ్ ఐటీఐ పూర్తి చేయగా నరేశ్ డిగ్రీ చదువుతున్నాడు. అలాగే, మహబూబాబాద్ మండలం నేరడకు చెందిన నేరెల్ల వీరభద్రం, మంగమ్మ దంపతులకు శాంతి, ప్రశాంతి కవల పిల్లలు. మహేశ్, శాంతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
కవలల కల్యాణం.. కనులకు రమణీయం! - twins marriage latest news
వివాహమంటే కనుల పండుగ. ఓ వేదికపై అంతకుమించిన సంబురంతో.. సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది. మహబూబ్‌బాద్ జిల్లా వెంకటగి గ్రామం ఆ అరుదైన ఘట్టానికి వేదికైంది.

Male twins were married to female twins in Venkatagiri village, Mahabubabad District
ఇరు వర్గాల పెద్దలు వారి కల్యాణానికి అంగీకరించారు. అంతేకాక మహేశ్ సోదరుడు నరేశ్‌తో.. శాంతి సోదరి ప్రశాంతికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీనికి నరేశ్, ప్రశాంతి అంగీకారం తెలపడంతో గురువారం ఒకే వేదికపై రెండు కవల జంటలకు వివాహం చేశారు.