మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. 1969 సంవత్సరం నుంచి తుదిశ్వాస విడిచే వరకు ప్రత్యేక తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొనియాడారు.
ఆచార్య జయశంకర్‌కు శంకర్‌నాయక్ నివాళి - mla shankar nayak
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నివాళి అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు కేసీఆరే సరైన వ్యక్తి అని నమ్మి.. ఆయనతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందకుతీసుకెళ్లారని తెలిపారు.
ఆచార్య జయశంకర్‌కు శంకర్‌నాయక్ నివాళి
TAGGED:
mla shankar nayak