మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. వరంగల్ - ఖమ్మం జాతీయరహదారి తొర్రూరు మధ్యగా వెళ్తుంది. ఈ గుంతల వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గుంతలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి.
తొర్రూరులో రోడ్లు గుంతలమయం... పట్టించుకోని అధికారులు - తొర్రూరులో రోడ్లు గుంతలమయం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో రోడ్లపై గుంతలు పడ్డాయి. వర్షం పడితే ఈ గుంతలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. వరంగల్ - ఖమ్మం జాతీయరహదారి తొర్రూరు గుండానే వెళ్తుంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
thorrur road damage
ఎన్ని రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్థానికులే గుంతల వద్ద గుర్తులుగా డ్రమ్ములు, ట్రేలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మర్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'