తెలంగాణ

telangana

ETV Bharat / state

తండాల్లో సరకులు పంపిణీ చేసిన మహబూబాబాద్ జిల్లా జడ్జి - తండాల్లో సరకులు పంపిణీ చేసిన మహబూబాబాద్ జిల్లా జడ్జి

మహబూబాబాద్ జిల్లాలోని పలు తండాల్లో న్యాయమూర్తి పర్యటించారు. స్థానిక మహిళలతో ముచ్చటించి వారి సాధక బాధలు తెలుసుకున్నారు. అనంతరం నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

By

Published : Apr 8, 2020, 12:24 PM IST

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం లింబ్యాతండా, కస్నాతండాల్లో జిల్లా న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌ పర్యటించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వలస కూలీల కష్టాలు తెలుసుకునేందుకు ఆయా తండాలను సందర్శించారు. అనంతరం మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలతో సమావేశమయ్యారు. మహిళలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పిల్లలతో పాటలు పాడించి వారిలో మనోధైర్యాన్ని నింపారు.

జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

మీకెలాంటి కష్టం రానివ్వబోం..

కూలీలతో పాటు కలిసి నేలపై కూర్చొని వారితో ముచ్చటించారు. ఎలాంటి కష్టం రానివ్వబోమని భరోసా నిచ్చారు. జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో వలస కూలీలకు బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అడ్డు కట్ట వేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో బార్‌ ఆసోసియేషన్ ప్రతినిధులు, మండల పోలీసులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : దేశంలో 5వేలకు చేరువలో కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details