తెలంగాణ

telangana

ETV Bharat / state

88 గంటలు నిర్విరామంగా గణితం బోధన.. గిన్నిస్​ బుక్​ లక్ష్యంగా.. - Warangal Latest News

K Laxman maths teacher: గిన్నిస్ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డు లక్ష్యంగా మహబూబాబాద్​ జిల్లాకు చెందిన ఓ గణిత ఉపాధ్యాయుడు నిర్విరామంగా 88 గంటలు పాటు బోధించి అందర్ని అబ్బురపరిచాడు. దీంతో ఆయన్ను పట్టణ వాసులు సన్మానించి మీఠాయిలు తినిపించారు.

teacher Lakshman
teacher Lakshman

By

Published : Jan 1, 2023, 10:54 PM IST

K Laxman maths teacher: మనం కనీసం గంట టైమ్ నిల్చొని​ మాట్లాడడానికే నానా తంటాలు పడుతున్న రోజులివి. కానీ ఓ ఉపాధ్యాయుడు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​ లక్ష్యంగా 88 గంటలు.. గణిత పాఠాలు బోధించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబాబాద్​ జిల్లాకు బాబునాయక్​ తండాకు చెందిన కె. లక్ష్మణ్​ గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలోనే గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అందుకనుగుణంగా గణిత పాఠాలనే బోధించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే డిసెంబర్​ 27 నుంచి 31వరకు నిర్విరామంగా పాఠాలు బోధించి... అందరని అబ్బురపరిచాడు.

"గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​లో భాగంగా నేను గత నెల 27వ తేదీ నుంచి 31 వరకు విశ్రాంతి తీసుకోకుండా గణితం బోధించాను. నేను మొదట 72 గంటలు అనుకున్నా కానీ అలా 88 గంటలు చెప్పా.. నాకు సహకరించిన అందరికి చాలా కృతజ్ఞతలు." -కె.లక్ష్మణ్​, ఉపాధ్యాయుడు

88 గంటలు నిర్విరామంగా గణితం బోధన.. గిన్నిస్​ బుక్​ లక్ష్యంగా..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details