చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగిన ఘర్షణలపై ఆయన స్పందించారు.
'శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదు' - ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వార్తలు
నెల్లికుదురులో జరిగిన ఘర్షణల్లో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఆంటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
'శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదు'
ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి... తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టామని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఇరువర్గాలకు చెందిన వారు సమన్వయం పాటిస్తూ... శాంతి భద్రతలకు ఆటంకం కలుగకుండా చూడాలని ఎస్పీ సూచించారు.
ఇదీ చూడండి:భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై దాడి..!