బయటకు వచ్చిన వారు తప్పకుండా మాస్కు ధరించాలని లేనిపక్షంలో రూ.1000 జరిమానా విధిస్తామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. జిల్లాలో కరోనా కోరలు చాచకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే! - mahabubabad sp koti reddy
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించి కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే!
అత్యవసర సమయంలో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని ఎస్పీ తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి ఆటోలో ఎక్కువ మంది తిరిగితే ఎం.వి ఆక్ట్ కింద ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 150కి పైగా ఈ-పెట్టీ కేసులు విధించినట్టు ఎస్పీ వెల్లడించారు.