మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు సాలార్ తండా సమీపంలో స్పీడ్ లేజర్ గన్, బాడీ వార్న్ కెమెరాలను ఆయన ప్రారంభించారు. రహదారులపై తప్పు చేసిన వారు, తప్పు చేయని వారు కూడా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, దీనంతటికీ ప్రధాన కారణం అతివేగమేనని వెల్లడించారు. దీనిని నియంత్రించేందుకు మెట్రో నగరాల శివారులో ఉపయోగించే స్పీడ్ లేజర్ గన్లను... గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోస్తున్నామన్నారు.
మహబూబాబాద్‌లో స్పీడ్ గన్ల ఏర్పాటు - స్పీడ్ గన్ల
అన్నింటికంటే విలువైనది మనిషి ప్రాణం. అతి వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా స్పీడ్ లెజర్ గన్స్ ఏర్పాటు చేశారు.
మహబూబాబాద్‌లో స్పీడ్ గన్ల ఏర్పాటు