ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నారెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డికి 191వ ర్యాంకు సాధించి తన సత్తాను చాటారు. సూర్యప్రకాశ్‌రెడ్డికి తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి సంబురాలు జరుపుకున్నారు. సూర్యకి చిన్నప్పటి నుంచే పరిశోధనల పట్ల ఆసక్తి ఉండేది. కుమారుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు.. అతనికి ఇష్టమైన కోర్సల్లో చేర్పించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా చాటిన సూర్యప్రకాశ్‌రెడ్డి - మహబూబాబాద్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నారెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డికి 191వ ర్యాంకు సాధించాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా చాటిన సూర్యప్రకాశ్‌రెడ్డి
కష్టపడి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవగా.. ఇప్పుడు ఈ ర్యాంకు సాధించానని.. ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని సూర్య చెప్పారు. ఈ ర్యాంక్ సాధించేందుకు సహకరించిన కళాశాల సిబ్బందికి, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:'పండుగల సమయంలో ప్రభుత్వ సూచనలు పాటించండి'