మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అక్రమంగా కారులో తరలిస్తున్న మిర్చి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారును పరిశీలించగా... నిషేధించిన 13 రకాల 543 ప్యాకెట్లను గుర్తించారు.
Fake Seeds: నకిలీ విత్తనాల తరలింపుపై పోలీసుల కొరడా - నకిలీ మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నకిలీ విత్తనాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న విత్తనాలను పట్టుకుంటూ నిందితులను కటకటాలకు పంపిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో రూ.3.3 లక్షల విలువైన నిషేధిత విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాల తరలింపుపై పోలీసుల కొరడా
పట్టుకున్న విత్తనాల విలువ రూ.3.33 లక్షలు ఉంటుందని సీఐ సాగర్ తెలిపారు. విత్తనాలతో పాటు కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేని విత్తనాలను అమ్ముతున్న మగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా