మహబూబాబాద్ జిల్లా ఏఎస్పీ ప్రభాకర్ పట్టణంలోని పలు వీధులలో తిరుగుతూ లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై తిరుగుతున్న ద్విచక్ర వాహన దారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అవసరం లేని వారు రోడ్లపైకి వస్తుండడం వల్ల వారితో గుంజీలు తీయించారు. అవసరం లేని సమయంలో మరోసారి రోడ్లపై తిరగబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.
అనవసరంగా వచ్చారు.. గుంజీలు తీశారు - ప్రతిజ్ఞ
లాక్డౌన్ ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల చేత మహబూబాబాద్ ఏఎస్పీ గుంజీలు తీయించారు. మరోసారి తాము అనవసరంగా రోడ్లపైకి రాబోమని వారితో ప్రతిజ్ఞ చేయించి... కౌన్సిలింగ్ ఇచ్చారు.
అనవసరంగా రోడ్డుపైకి వచ్చి గుంజీలు తీశారు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అధికారులు ఆదేశాల మేరకే తాము ఈ విధంగా నడుచుకుంటున్నామని ఏఎస్పీ తెలిపారు. 24 గంటలు డ్యూటీ చేస్తూ... ప్రజల బాగు కోసమే ఈవిధంగా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మీకు నమస్కారం చేస్తున్నా ప్రజలంతా మరోసారి ఆలోచించండి, ప్రభుత్వ నిబంధనలు పాటించండి, అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల