తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత - ఎస్పీ కోటిరెడ్డి

అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్​ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కురవి మండల పరిధిలోని లింగ్యాతండా వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Mahabubabad Police caught Illegal jaggery
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

By

Published : Aug 22, 2020, 12:38 AM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల శివారు లింగ్యాతండా వద్ద క్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన లారీలో తనిఖీలు చేశారు. ఏపీలోని చిత్తూరు నుంచి లింగ్యాతండాకు అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, 15 క్వింటాళ్ల పటికను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్‌ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పట్టుబడిన బెల్లం విలువ రూ.7.50 లక్షల ఉంటుందన్నారు.

మహబూబాబాద్‌కు చెందిన భూక్యా సురేష్‌, లింగ్యాతండాకు చెందిన మాలోతు సునీల్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన అనిల్‌, చెన్నైకి చెందిన లారీ డ్రైవర్‌ సురేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. భూక్యా సురేష్‌పై ఇప్పటికే పలు కేసులు ఉండగా.. అతడిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. బెల్లం, గుట్కా, ఇసుక, పీడీఎస్‌ బియ్యం దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటరత్నం, ఎస్సై శంకర్‌రావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'

ABOUT THE AUTHOR

...view details