తెలంగాణ

telangana

ETV Bharat / state

నిల్వ చేసిన గుట్కా స్వాధీనం.. ఒకరు అరెస్ట్, ముగ్గురు పరారీ! - మహబూబాబాద్​ పోలీసులు

అక్రమంగా నిల్వ చేసిన లక్ష  రూపాయల విలువ చేసే మూడు బస్తాల నిషేధిత గుట్కాను మహబూబాబాద్​ రూరల్​ పోలీసులు పట్టుకున్నారు. గుట్కా నిల్వ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని సీఐ వెంకటరత్నం తెలిపారు.

Mahabubabad Police Attacks on Banned Gutkha
అక్రమ గుట్కా స్వాధీనం.. ఒకరు అరెస్ట్.. ముగ్గురు పరారీ!

By

Published : Jul 7, 2020, 7:59 AM IST

మహబూబాబాద్​ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన లక్ష రూపాయల విలువ చేసే మూడు బస్తాల అంబర్​, సగం బస్తా గుట్కా ప్యాకెట్లను మహబూబాబాద్​ రూరల్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒకరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కంబాలపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీను, శంకర్​, ఉపేందర్​, నర్సయ్య అనే నలుగురు వ్యక్తులు కారులో బీదర్, హైదరాబాద్​ నుంచి గుట్కా, అంబర్​ ప్యాకెట్లను తీసుకొచ్చి మహబూబాబాద్​ పట్టణంతో పాటు.. చుట్టు పక్కల గ్రామాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని, పరారీలు ఉన్న ముగ్గురు వ్యక్తులను కూడా పట్టుకుంటామని సీఐ వెంకటరత్నం తెలిపారు. అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్​ చేసేవారు మానుకోవాలని.. లేకపోతే.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details