తెలంగాణ

telangana

ETV Bharat / state

మాలోత్ కవితను అడ్డుకున్న వరద ముంపు బాధితులు

ములుగు జిల్లాలో ముంపునకు గురైన ఏటూరునాగారం ప్రాంతంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్​ కవిత పర్యటించారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పోదుమురు గ్రామస్థులు ఎంపీని అడ్డుకోగా... సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

By

Published : Aug 18, 2020, 2:28 PM IST

mahabubabad mp mlothu kavith visit floating areas in mulugu
ముంపు ప్రాంతాల్లో ఎంపీ మాలోత్ కవిత పర్యటన

వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు లోత్తట్టు గ్రామాలు, ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పరిశీలించారు. వరదలో చిక్కుకున్న బాధితులను అధికారులు ఖాళీ చెేయించి... పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరునాగారంలోని ఎస్సీ కాలనీ, ఓడగూడెం, నందమూరికాలని,జీడివాగు, రామన్నగూడెం, పుష్కార ఘాట్ లని పరిశీలించారు.

పోదుమురు గ్రామస్థులు ఎంపీ కవితను అడ్డుకొని... వరదలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగపేట మీదుగా అక్కినపెల్లి మల్లారం వరకు రివిట్మెంట్​ కట్టాలని... గతంలోనే రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి... పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details