భాజపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలంతా తెరాస వెంట ఉన్నారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహబూబాబాద్ మూడో స్థానంలో ఉందని... ఇందుకు కృషి చేసిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుతున్నట్టు పేర్కొన్నారు. కమలం నేతలు తెరాసపై విమర్శలు మాని... రాష్ట్రానికి రావాల్సిన వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తెరిపించాలని... సమ్మక్క సారలమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేయాలని చెప్పారు.
'చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురండి' - మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత
భాజపా నాయకులకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు.
మాలోతు కవిత