తెలంగాణ

telangana

ETV Bharat / state

మామిడికాయ పచ్చడి పెట్టిన మహబూబాబాద్​ ఎంపీ - mango pickle

ప్రజాప్రతినిధులు ఓ వైపు ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత తన కుటుంబసభ్యులతో కలిసి మామిడికాయ పచ్చడి పెడుతూ సరదాగా గడిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు.

Mahabubabad MP maloth kavitha made mango chutney
మామిడికాయ పచ్చడి పెట్టిన మహబూబాబాద్​ ఎంపీ

By

Published : May 17, 2020, 11:29 PM IST

లాక్​డౌన్​లో ప్రజలంతా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారని, అధికారులు బాగా పనిచేస్తున్నారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఆమె మాట్లాడారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఒకవైపు ప్రజాసేవ చేస్తూ... మరోవైపు కుటుంబ సభ్యులతో గడుపుతున్నానని ఆమె అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మామిడి కాయ పచ్చడి పెట్టామని మాలోత్​ కవిత తెలిపారు.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభంలో కరోనా కేసులు నమోదైనా... ప్రస్తుతం గ్రీన్ జోన్​లో ఉందని ఎంపీ వెల్లడించారు. వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ ఈనెల 31 వరకు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details