తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే శంకర్ నాయక్ 'బస్తీబాట' - Mahabubabad MLA Shankar naik tour in city

మహబూబాబాద్ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ 'బస్తీ బాట' పట్టారు. పలు కాలనీల్లో తిరిగి నగర ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

mahabubabad-mla-shankar-naik-tour-in-city
ఎమ్మెల్యే శంకర్ నాయక్ 'బస్తీబాట'

By

Published : Dec 9, 2019, 12:31 PM IST

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు రైల్వే అండర్ బ్రిడ్జితో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

పట్టణంలో రోడ్లను వెడల్పు చేసి అన్ని విధాలుగా సుందరీకరణ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్ల వెడల్పులో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ 'బస్తీబాట'

ఇవీ చూడండి: దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details