తెలంగాణ

telangana

ETV Bharat / state

వంద రూపాయలకు... 5రకాల పండ్ల కిట్ - మహబూబాబాద్ జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సూర్య నారాయణ

లాక్‌డౌన్‌ కాలంలో పండ్ల రైతులను ఆదుకోవడమేగాక.... వినియోగదారుల అవసరాలు తీర్చాలన్న ఆలోచనతో మహబూబాబాద్‌ జిల్లా ఉద్యాన వన శాఖ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వంద రూపాయలకు... ఐదు రకాల పండ్లను విక్రయించే 100 కిట్లు పది నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో మరిన్ని స్టాల్స్‌ ఏర్పాటు చేయడానికి ఆధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

mahabubabad-hatri-culture-officers-start-experiment-to-seal-fruits-mahabubabad-district
వంద రూపాయలకు... 5రకాల పండ్ల కిట్

By

Published : Apr 22, 2020, 11:23 AM IST

కరోనా నేపథ్యంలో పండ్ల రైతులను నష్టాల నుంచి బయట పడేయడానికి మహబూబాబాద్ జిల్లా ఉద్యాన వన శాఖ అధికారులు నూతన పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వంద రూపాయలకు... ఐదు రకాల పండ్లను విక్రయించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రజలనుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

100 రూపాయలకు ఒక కర్భుజ, పుచ్చకాయ, బొప్పాయి, నాలుగు బత్తాయిలు, 10 నిమ్మకాయలతో కూడిన 100 కిట్లను తయారు చేసి స్థానికంగా ఉన్న ఇందిరాగాంధీ సెంటర్‌లో విక్రయించారు. పది నిమిషాల్లోనే 100 కిట్లు అమ్ముడుపోయాయి. చాలామంది కిట్లు దొరకక వెనుదిరిగి వెళ్లారు. ప్రజలనుంచి మంచి ఆదరణ ఉన్నందున మరిన్ని ఏర్పాట్లు చేస్తామని ఆధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, పండ్ల రైతులు... ఈ విధంగా విక్రయించేందుకు ముందుకు వస్తే వారికి అనుమతులు ఇవ్వడమే కాక పండ్లను సప్లై చేస్తామని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సూర్యనారాయణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు దైద వెంకన్న, ఉద్యాన వన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ

ABOUT THE AUTHOR

...view details