తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు డీఎస్పీ వెంకటరమణ భరోసా - మహబూబాబాద్​ డీఎస్పీ వెంకటరమణ వార్తలు

గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ కొవిడ్​ బాధితులకు ధైర్యం చెబుతున్నారు మహబూబాబాద్​ డీఎస్పీ వెంకటరమణ. తొర్రూరు మండలం వెంకటాపురంలో కరోనా బాధితులను పరామర్శించారు.

కరోనా బాధితులకు డీఎస్పీ వెంకటరమణ భరోసా
కరోనా బాధితులకు డీఎస్పీ వెంకటరమణ భరోసా

By

Published : May 26, 2021, 10:25 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో డీఎస్పీ వెంకటరమణ పర్యటించారు. గ్రామ సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హోమ్ క్వారంటైన్​లో ఉన్న కరోనా బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపారు.

పౌష్టిక ఆహారం తీసుకోవాలని, మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఇంటి పరిసరాలను ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ కరుణాకర్ రావు, ఎస్సై నగేశ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ABOUT THE AUTHOR

...view details