మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో డీఎస్పీ నరేశ్ కుమార్ 150 మంది పోలీస్ సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు,4 ఆటోలు, రూ. 50వేల విలువైన అక్రమ మద్యం, రూ. 10 వేల విలువగల నిషేధిత గుట్కాతో పాటు అనుమతి లేకుండా నిల్వ చేసిన దీపావళి పటాకులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చట్ట రీత్యా.. కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నరేశ్ హెచ్చరించారు.
అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ - మహబూబాబాద్ జిల్లా కేంద్రం
మహబూబాబాద్‌లో డీఎస్పీ నరేశ్ కుమార్ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 20 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, 50 వేల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ