తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ మేడారంలో సీతక్క నృత్యం - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు చెట్టును పుట్టను దైవాలుగా నమ్ముకుని పూజిస్తారని... ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారులోని 'చింతలగట్టు వట్టివాగు మినీ మేడారం జాతర'లో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనులతో కలిసి సీతక్క నృత్యం చేశారు.

Mahabubabad District Sri Chintala Gattu Vatti Vagu Mini Medaram jatara
గిరిజనులు చెట్టు, పుట్టను దైవాలుగా పూజిస్తారు: ఎమ్మెల్యే సీతక్క

By

Published : Feb 24, 2021, 8:18 PM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారులోని 'చింతలగట్టు వట్టివాగు మినీ మేడారం జాతర'లో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన పూజారులు సంప్రదాయ పద్దతిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. మేడారంలో జరిగే జాతర లాగానే 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి ధారం సిద్ధు తెలిపారు

గిరిజనులతో సీతక్క నృత్యం

మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు చెట్టును పుట్టను దైవాలుగా నమ్ముకుని పూజిస్తారని... ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రభుత్వం స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. మినీ మేడారం జాతరలు జరిగే ప్రాంతాలలో కనీసం జాతరకు రూ.25 లక్షలను కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులతో కలిసి సీతక్క నృత్యం చేశారు. ఈ మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు.

గిరిజనులు చెట్టు, పుట్టను దైవాలుగా పూజిస్తారు: ఎమ్మెల్యే సీతక్క

ఇదీ చదవండి: సీజీఎస్టీ కమిషనర్​ బొల్లినేని శ్రీనివాస్​ గాంధీ సస్పెండ్​

ABOUT THE AUTHOR

...view details