Mahabubabad District SP Transfer :మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శరత్‌చంద్ర పవార్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీచేస్తూ.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 డిసెంబరు 26వ తేదీన శరత్‌చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
MLA Rekha Naik Son in Law Transfer : డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను శరత్‌చంద్ర స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్‌అల్లుడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(CM KCR) ఇటీవల ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోగా.. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆమె రంగం సిద్ధంచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరత్‌చంద్ర పవార్ బదిలీ విషయం చర్చనీయాంశమైంది.
SP Sharat Chandra Pawar Transfer :బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. శాసనసభ అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురైన ప్రస్తుత ఖానాపూర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేయడంతో ఈ విషయం కాస్త రాజకీయంగా కాకరేపింది. అలాగే ఆసిఫాబాద్ టికెట్ కోసం రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరిన విషయం చేరారు.