తెలంగాణ

telangana

ETV Bharat / state

Lock Down : లాక్​డౌన్ సమయంలో బయటకొస్తే కఠిన చర్యలు - mahabubabad district news

మహబూబాబాద్ జిల్లాలో లాక్​డౌన్ ఆంక్షలు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు. ప్రజలంతా నిబంధనలకు కట్టుబడి పోలీసులకు సహకరించాలని కోరారు.

lock down in mahabubabad district,  mahabubabad district sp koti reddy
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో లాక్​డౌన్

By

Published : May 31, 2021, 6:42 PM IST

రాష్ట్రంలో నేటి నుంచి లాక్​డౌన్ సమయాన్ని కాస్త సడలించటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రహదారులపై సాధారణ ట్రాఫిక్ కనపడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒంటి గంటకే వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పర్యటించారు. పలు సెంటర్లు, చెక్ పోస్టులను సందర్శించి లాక్ డౌన్ పరిస్థితిని పరిశీలించారు.

సడలింపు సమయం తరువాత రహదారులపై సంచరిస్తున్న వాహనదారులను అడ్డుకుని వాహనాలు సీజ్ చేసారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. ప్రజలంతా కచ్చితంగా లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details