తెలంగాణ

telangana

35 ఇళ్లున్న ఊరిలో 32 మందికి కరోనా..!

కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు హోంక్వారంటైన్​లో ఉండకపోతే వారిని ప్రభుత్వ క్వారంటైన్​ కేంద్రాలకు తరలిస్తామని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ వి.పి. గౌతం హెచ్చరించారు. గూడూరు మండలం గాజుల గట్టు గ్రామ పంచాయతీలోని వస్రాం తండాలో కలెక్టర్​ పర్యటించారు.

By

Published : Sep 24, 2020, 11:04 PM IST

Published : Sep 24, 2020, 11:04 PM IST

35 ఇళ్లున్న ఊరిలో 32 మందికి కరోనా..!
35 ఇళ్లున్న ఊరిలో 32 మందికి కరోనా..!

మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులోని వస్రాం తండాలో కలెక్టర్​ వి.పి.గౌతం పర్యటించారు. గ్రామంలో కరోనా వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవాసంలో 35 ఇళ్లు ఉండగా.. 32మందకి కరోనా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కొవిడ్​ కట్టడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ సర్పంచ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినాయకచవితి వేడుకలు ఆర్బాటంగా జరుపుకోవద్దని హెచ్చరించినప్పటికీ వినకపోవడం వల్ల కొవిడ్​ వ్యాపించిందని అధికారులు వివరించారు. ప్రజలు మాట వినకపోతే అధికారులు ఏమిచేస్తున్నారని కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

35 ఇళ్లున్న ఊరిలో 32 మందికి కరోనా..!

గ్రామంలో విద్యార్థులకు పాఠశాల నిర్వహిస్తున్నారని తెలిసి ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గుడూరు ప్రభుత్వాసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణ పనులపై ఆరా తీశారు.

ఇదీ చూడండి:రెట్టింపు వస్తాయని డబ్బులు కట్టించుకున్నారు... అడిగితే లేవంటున్నారు

ABOUT THE AUTHOR

...view details