మహబూబాబాద్ జిల్లా సాలార్ తండా సమీపంలో సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణ పనుల్లో సెంట్రింగ్ కూలడంతో గాయపడిన కార్మికులను... జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు పరామర్శించారు. వారంతా ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కార్మికులకు కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శ - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సెంట్రింగ్ కూలి గాయపడిన కార్మికులను మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
గాయపడిన కార్మికులకు కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శ
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కలెక్టర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఇదీ చదవండి: అడవుల్లో పులుల ఆధిపత్య పోరు.. ఎందుకో తెలుసా?