ఆత్మనిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ కింద మహబూబాబాద్ జిల్లాలోని బ్యాంకులు అమలు చేస్తోన్న రుణ ప్రక్రియపై కలెక్టర్ వీపీ గౌతమ్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రుణ ప్రణాళిక అమలు పరిచి లక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వ సూచనల ప్రకారం తక్షణ కేసీసీ రుణం మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని మత్స్యకారులకు చేపల చెరువుల కోసం రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు.
'పటిష్ఠ రుణ ప్రణాళిక అమలుతో పేదల ప్రగతి' - mahabubabad collector vp gowtham
పేదల ఆర్థిక ప్రగతిని మెరుగుపరిచేందుకు బ్యాంకులు రుణ ప్రణాళికను పటిష్ఠంగా అమలు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

బ్యాంకర్లతో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సమీక్ష
జిల్లాలో వెనుకబడిన కొత్తగూడ, గంగారం మండలాల్లో రుణసదుపాయాలు పెంచి పేదల అభివృద్ధి కృషి చేయాలని కలెక్టర్ గౌతమ్ బ్యాంకర్లను కోరారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళకు కొవిడ్-19 కింద రూ.6.91 కోట్ల రుణాలు మంజూరు చేయించి రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో బ్యాంక్లతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా