ఎస్సీ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్సీ విద్యార్థులకు లాప్టాప్లను పంపిణీ చేశారు.
ఎస్సీ విద్యార్థులకు లాప్టాప్ల పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆరుగురు ఎస్సీ విద్యార్థులకు లాప్టాప్లను పంపిణీ చేశారు. ఎస్సీ విద్యార్థులు అనుకున్నంత కంటే.. ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు.
ఎస్సీ విద్యార్థులకు కలెక్టర్ లాప్టాప్ల పంపిణీ
ఎస్సీ విద్యార్థులు అనుకున్నంత కంటే.. ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించాలని, విద్యాతోనే ఆర్థికాభివృద్ధి ఉంటుందని గ్రహించాలని కలెక్టర్ కోరారు. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇంటర్ దాకా విద్యను అభ్యసించి.. ఉన్నత విద్యాభ్యాసం కోసం వివిధ రాష్ట్రాల్లో సీటీ సాధించిన విద్యార్థులను అభినందించారు.
- ఇదీ చదవండి:కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కథేంటి?