తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2020, 11:19 AM IST

ETV Bharat / state

'వారం టైం ఇస్తున్నాం... లేదంటే క్రిమినల్ కేసులే'

అక్రమార్కులు ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

Mahabubabad collector on occupying forest lands
'వారం టైం ఇస్తున్నాం... లేదంటే క్రిమినల్ కేసులే'

అటవీభూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేసినట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. వారి చేతుల్లో సుమారు 3,500 ఎకరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కోటిరెడ్డి, డీఎఫ్‌వో కిష్టాగౌడ్‌తో కలిసి కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఆక్రమణకు గురైన అటవీ భూముల వివరాలను వెల్లడించారు.

'వారం టైం ఇస్తున్నాం... లేదంటే క్రిమినల్ కేసులే'

జిల్లా వ్యాప్తంగా 2010 తర్వాత ఈ ఆక్రమణలు జరిగాయని, 119 మంది వద్ద 3,500 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూములను అటవీశాఖకు అప్పగించాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశామని... అయినా వారు ముందుకు రావడం లేదన్నారు. వారం రోజుల గడువు ఇస్తున్నామని, తిరిగి ఇవ్వని పక్షంలో క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కబ్జాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..

ABOUT THE AUTHOR

...view details