కంబాలపల్లి పల్లె ప్రకృతి వనాన్ని మహబూబాబాద్ జిల్లాకు రోల్ మోడల్‌గా నిలపాలని కలెక్టర్ గౌతమ్.. అధికారులకు సూచించారు. మండలంలోని కంబాలపల్లి, సికింద్రాబాద్ తండా, మాధవాపురం గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నర్సరీల్లోని బ్యాగ్ ఫిల్లింగ్, బ్యాగ్‌ల గట్టిదనాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా జాతీయ రహదారికి ఆనుకొని కంబాలపల్లి నర్సరీ ఉండడంతో ఈ పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 500 పెద్ద చెట్లు అదనంగా నాటాలని చెప్పారు.
'కంబాలపల్లి ప్రకృతి వనాన్ని ఆదర్శంగా నిలపాలి' - mahabubabad district collector gowtham
మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో కలెక్టర్ గౌతమ్ విస్తృతంగా పర్యటించారు. పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. జిల్లా కేంద్రానికి, జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న కంబాలపల్లి పల్లె ప్రకృతి వనాన్ని జిల్లాకు రోల్ మోడల్‌గా నిలపాలని అధికారులకు సూచించారు.
'కంబాలపల్లి ప్రకృతి వనాన్ని రోల్ మోడల్‌గా నిలపాలి'
అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో వైకుంఠధామాలు, నర్సరీలు, రైతు వేదికల అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. పనులు వేగవంతంగా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇదీ చదవండి:ఫిర్ ఏక్ బార్.. పతంగ్ ప్రహార్
Last Updated : Dec 6, 2020, 1:19 PM IST