మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కొవిడ్ బ్లాక్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ - మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కొవిడ్ బ్లాక్ పనులను ఆయన పరిశీలించారు.
![జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ Mahabubabad collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:12:03:1619538123-tg-wgl-22-27-collector-hospatal-aakasmika-thanike-av-photo01-ts10071-2704digital-1619537916-85.jpg)
Mahabubabad collector
కొవిడ్ సెంటర్లో వైద్యులు ఎప్పుడు అందుబాటులోనే ఉండాలన్నారు కలెక్టర్. అందుకు అనుగుణంగా 24 గంటల డ్యూటీ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటరాములు, ఆర్ఎంఓ రమేశ్, కొవిడ్ బ్లాక్ ఇంఛార్జీ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భద్రాద్రిలో బూజుపట్టిన లడ్డూలు.. నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన అధికారులు