తెలంగాణ

telangana

సర్పంచ్, ఎంపీడీవోపై కలెక్టర్ ఆగ్రహం

సర్పంచ్, ఎంపీడీవోపై మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ ఆగ్రహించారు. వావిలాల గ్రామంలో టేకు చెట్లు మాత్రమే ఉండటం.. మిగతా మొక్కలు లేకపోవడం పట్ల మండిపడ్డారు. ఉన్న మొక్కలు కూడ సరిగా లేవని అంసంతృప్తి వ్యక్తం చేశారు.

By

Published : Jun 30, 2020, 8:58 PM IST

Published : Jun 30, 2020, 8:58 PM IST

సర్పంచ్, ఎంపీడీవోపై కలెక్టర్ ఆగ్రహం
సర్పంచ్, ఎంపీడీవోపై కలెక్టర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్‌.. నెల్లికుదురు మండలంలో పర్యటించారు. వావిలాల, నెల్లికుదురులోని గ్రామపంచాయతీ నర్సరీలను పరిశీలించారు. వావిలాలలో ఒక టేకు చెట్లే ఉండటం.. మిగతా మొక్కలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉన్న మొక్కలు కూడా సరిగా ఎదుగుదల లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎదుగుదల లేని మొక్కలను నాటితే అవి ఎలా పెరుగుతాయని గ్రామ సర్పంచ్‌, ఎంపీడీవోలను కలెక్టర్‌ ప్రశ్నించారు. ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలను నాటి.. సంరంక్షించాలని గౌతమ్‌ సూచించారు.

ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details