మహబూబాబాద్‌లో కూరగాయల మార్కెట్, పలు వీధులను కలెక్టర్ వీపీ గౌతం సందర్శించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రిజిస్టర్ ప్రకారం వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? ప్రతి నెల కాన్పుల వివరాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని ఆరా తీశారు.
'సమయ పాలన పాటించకపోతే నోటీసులివ్వండి' - మహబూబాబాద్‌లో కలెక్టర్ పర్యటన
మహబూబాబాద్‌లో కలెక్టర్ వీపీ గౌతం ఆకస్మికంగా పర్యటించారు. కూరగాయల మార్కెట్‌ను, పలు వీధులు, ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేశారు. సమయపాలన పాటించని సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
'సమయం పాలన పాటించకుంటే నోటీసులివ్వండి'
సిబ్బందికి పంపిణీ చేసే మాస్కులు పీహెచ్‌సీలకు చేరాయా? వైద్య సిబ్బంది వినియోగిస్తున్నా? అనే విషయంపై జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించని సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
Last Updated : Apr 14, 2020, 12:13 PM IST