తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్ల పంపిణీ - mahaboobabad zp chair person bindu

మహబూబాబాద్​లో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్లను అందజేశారు. కరోనా కారణంగా ముస్లిం ప్రజలందరూ ఇంట్లోనే ఉండి రంజాన్ జరుపుకోవాలని సూచించారు.

ramzan kits distribution in mahaboobabad
నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్ల పంపిణీ

By

Published : May 23, 2020, 3:51 PM IST

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ముస్లింల ఇంట్లోనే ఉండి రంజాన్ జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు తెలిపారు. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తఫా నగర్​లో 150 నిరుపేద ముస్లింలకు వీరన్న బ్రదర్స్ సహకారంతో ఆమె రంజాన్ సరుకులను పంపిణీ చేశారు.

ప్రభుత్వం తరఫున ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేయలేకపోవడం బాధాకరమని... దాతల సహకారంతో రంజాన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయిందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ముస్లింలకు రంజాన్ సరుకులను అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సర్పంచ్ కోటమ్మ, ఉప సర్పంచ్ వీరబోయిన కవితలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details