మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో తెరాస నుంచి మాలోత్ కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, భాజపా నుంచి హుస్సేన్ నాయక్‌లు నిలిచారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకోవడం మాలోత్ కవితకు సానూకూలాంశాలు. గతంలో చేసిన అభివృద్ధి పనులు, బలమైన పార్టీ శ్రేణులు కలిగి ఉండటం బలరాం నాయక్‌కు సానుకూల అంశాలు. మోదీ ఛరిష్మా, యువనేత కావడం హుస్సేన్ నాయక్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల బలాబలాలు - congress balaram nayak
మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. మాలోత్ కవిత, బలరాం నాయక్, హుస్సేన్ నాయక్‌లు ప్రజలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల బలాబలాలు