మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్... కలెక్టర్ కార్యాలయంలో పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టుపక్కల ఆవరణలను శుభ్రపరిచారు. ప్రతి ఆదివారం పది గంటలకు అధికారులు వారివారి కార్యాలయాలను, ప్రజలు తమ తమ ఇళ్లను శుభ్ర పరుచుకోవాలని సూచించారు.
కలెక్టరేట్‌ను శుభ్రం చేసిన కలెక్టర్ వీపీ గౌతమ్ - mahaboobabad collector vp goutham latest news
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కెలెక్టర్ వీపీ గౌతమ్ 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

కలెక్టరేట్‌ను శుభ్రం చేసిన కలెక్టర్ వీపీ గౌతమ్
డాబాల పైన ఉండే వాటర్ ట్యాంకులపై మూతలు ఉండేలా... నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. డెంగ్యూ దోమలు మురుగు నీటిలో ఆవాసం ఉండవని, మంచినీటిలోనే ఆవాసాన్ని ఏర్పరుచుకుంటాయని తెలిపారు. అందుకే నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు.
ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం