పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలై 4 రోజులు గడిచినప్పటికీ పారిశుద్ధ్య పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పట్టణ ప్రగతిలో కారోబార్ నిర్లక్ష్యం.. విధుల నుంచి సస్పెండ్ - పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్ వి.పి గౌతమ్
పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఈదులపూసపల్లిని ఆకస్మికంగా సందర్శించారు కలెక్టర్ వి.పి గౌతమ్. అందులో భాగంగానే విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారోబార్ శ్రీనివాస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

పట్టణ ప్రగతిలో కారోబార్ నిర్లక్ష్యం.. విధుల నుంచి సస్పెండ్
వార్డులోని సమస్యలు గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారోబార్ శ్రీనివాస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని మునిసిపల్ కమీషనర్‌ను ఆదేశించారు. పర్యవేక్షణలో విఫలమైనందుకు వార్డ్ ప్రత్యేక అధికారి అయిన జిల్లా సంక్షేమ అధికారి సంధ్యా రాణికి మెమో జారీ చేశారు. వార్డులో చేయవలసిన పనులు, సమస్యలను వెంటనే గుర్తించి నివేదించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
పట్టణ ప్రగతిలో కారోబార్ నిర్లక్ష్యం.. విధుల నుంచి సస్పెండ్
ఇవీ చూడండి:గబ్బర్‌సింగ్ పెళ్లి సీన్ రిపీట్... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు