మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిదానపురం గ్రామంలోని ముదిరాజ్, బీసీ కాలనీల్లోని అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షాలకే బురదమయంగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. పలువురి ఇళ్లలోంచి వెలువడే మురుగు, వర్షపు నీరు రహదారులపై నిలవడం వల్ల దారులు బురద గుంతలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా... వీధుల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. సీసీరోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
వీధుల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన స్థానికులు - వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం
బురదమయంగా మారిన వీధుల్లో సీసీరోడ్లు నిర్మించాలని దంతాలపల్లి మండలం నిదానపురంలో కాలనీవాసులు డిమాండ్ చేశారు. వీధుల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.
వీధుల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన స్థానికులు
దోమలు, సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నానమని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీకి కాంక్రీట్ రోడ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'