తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రిలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ... అవసరాలకు పచ్చజెండా

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును కలెక్టర్​ వీపీ గౌతమ్​ పరిశీలించారు. ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​... ఆసుపత్రిలో లేని పలు సౌకర్యాలు, అవసరాలను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

By

Published : Feb 21, 2020, 12:07 AM IST

MABOOBABAD COLLECTOR SUDDEN VISIT TO GOVERNMENT HOSPITAL
MABOOBABAD COLLECTOR SUDDEN VISIT TO GOVERNMENT HOSPITAL

మహబూబాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, వైద్యులు, ప్రత్యేక నిపుణుల, వివరాల చార్ట్​లో పరిశీలించారు. బోర్డులను తెలుగు భాషలో ప్రదర్శించాలని ఆదేశించారు. పిండం ఆరోగ్యం తెలుసుకోవడానికి టిఫా స్కాన్ సౌకర్యం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... ఆసుపత్రిలో ఉన్న పరికరాలు, అవసరాల వివరాలను వెంటనే నివేదిక సమర్పించాలని వైద్యులకు సూచించారు.

ఫార్మసీలో ప్రతి ఔషధం ఈ-ఔషధి ద్వారానే జరగాలన్నారు. రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు. 920 రకాల మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని, రోగులకు అవసరమైన మందులన్ని ఉచితంగా ఇవ్వాలన్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్స్​లో ఎలిసా, డెంగ్యూ పరీక్షలు జరగడం లేదని దృష్టికి రాగా... అందుకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్​ ఆదేశించారు.

ఆస్పత్రిలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ... అవసరాలకు పచ్చజెండా

ఇదీ చూడండి:-ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details