మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామి, పార్వతి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. హరహర మహదేవ, శంభోశంకర నామజపంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణం - Kuravi ramalingeshwara swamy news
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ రామలింగేశ్వరస్వామి, పార్వతి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
![వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణం వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11143288-7-11143288-1616592983535.jpg)
వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణం
తొలుత ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. ఈ సమయం ఆలయంలో అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. హనుమంతుడి అవతారంగా భావించే వానరం కల్యాణంలో పాల్గొని రుద్రహోమంలోని నవధాన్యాలు, అరటి పండ్లు, పుష్టిగా ఆరగించింది. ఈ సన్నివేశం చూసి భక్తులు పులకించిపోయారు.
ఇదీ చూడండి:సీఏ పాస్ కాలేదని విద్యార్థిని ఆత్మహత్య