తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం - ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాసులు కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక శాసన సభ్యుడు శంకర్​నాయక్​, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం

By

Published : Jul 14, 2019, 11:01 AM IST

కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్​ కళాశాల ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాసుని కల్యాణం నిర్వహించారు. మైదానమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. హిందూ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు, సాధారణ భక్తుల కోసం టీటీడీ స్వామివారి కల్యాణోత్సవం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు టీటీడీ కల్యాణం ఇన్​ఛార్జీ కృష్ణయ్య తెలిపారు. పట్టణానికి చేరుకున్న శ్రీవారి రథానికి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు, కోలాటాలతో రథాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్​నాయక్​ హాజరయ్యారు. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details