తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధరల పెంపుతో సామాన్యునిపై పెనుభారం' - left parties protest

మహబూబాబాద్​లోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశారు. ధరల పెంపుతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

left parties protest against petrol and diesel rates increase
left parties protest against petrol and diesel rates increase

By

Published : Jun 25, 2020, 10:30 PM IST

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ మహబూబాబాద్​లోని తహసీల్దార్ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వాలు పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచటం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ కన్నా... డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి, న్యూ డెమోక్రసీ నాయకులు మండల వెంకన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అజయ్ సారథి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ABOUT THE AUTHOR

...view details