రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజు విస్తరిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 కేసులు గూడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ముగ్గురికి, మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో ఓ వ్యక్తికి, డోర్నకల్ మండలంలో ఒకరికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాయి.
మహబూబాబాద్‌లో మహమ్మారి విస్తరణ.. ఆదివారం 7 కేసులు నమోదు - latest news covid updates of mahabubabad
మహబూబాబాద్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 7 కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 675 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... 61 మందికి పాజిటివ్ అని తేలిందని.. మరో 27 మంది ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్యాధికారులు వెల్లడించారు.
![మహబూబాబాద్‌లో మహమ్మారి విస్తరణ.. ఆదివారం 7 కేసులు నమోదు latest corona cases in mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8002570-672-8002570-1594605095566.jpg)
మహబూబాబాద్‌లో మహమ్మారి విస్తరణ.. ఆదివారం 7 కేసులు నమోదు
వీటితో మొత్తంగా జిల్లాలో 61 మంది మహమ్మారి బారినపడ్డారు. కాగా వీరిలో 25 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 31 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు బాధితులు వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరిని మహమ్మారి కబలించింది. జిల్లాలో 675 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని.. 27 మంది ఫలితాలు రావలసి ఉందని కొవిడ్-19 జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ తెలిపారు.