మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలత వీరభద్రస్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలు జరిపి స్వామి వారిని అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా వీరభద్రస్వామి నామస్మరణతో మార్మోగింది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేశారు.
వీరభద్ర ఆలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన - కురవి వీరభద్ర ఆలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన
కురవిలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం వైభవంగా జరిపారు. కార్తిక మాసం సందర్భంగా మాస శివరాత్రి రోజు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీయాగం నిర్వహించారు. ఈ తరుణంలో పట్టణం అంతా భక్తుల ఆధ్యాత్మిక శోభతో కళకళ లాడింది.
వీరభద్ర ఆలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన
ప్రజలు అతివృష్టి.. అనావృష్టిల బారిన పడకుండా సుఖ సంతోషాలతో ఉండాలని... పాడి, పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఏటా లక్ష బిల్వార్చన పూజను నిర్వహిస్తున్నామని వేద పండితుడు శివ కిరణ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆలయ ఈఓ.సత్యనారాయణ, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ, రాబడి