తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశంలో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. అందులో 4 రాష్ట్రం నుంచే ఉన్నాయి'

రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచామని వివరించారు. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. తక్కువ కాలంలోనే భారతదేశంలోనే.. తెెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచిందని ఆయన వెల్లడించారు.

KTR
KTR

By

Published : Mar 8, 2023, 6:11 PM IST

Updated : Mar 8, 2023, 7:02 PM IST

దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజనలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని వివరించారు. చక్కని పనితీరు కనబర్చిన 20 గ్రామాల్లో.. 19 మన రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. రెండు త్రైమాసికాలకు సంబంధించి కేంద్రం 3, 4 స్టార్‌ రేటింగ్‌లు ఇచ్చాయని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో 20,000 మంది మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. రాష్ట్రానికి చెందిన 4 జిల్లాలు ఉన్నాయి: స్వచ్ఛ సర్వేక్షణ్ కింద తెలంగాణకు కేంద్రం ర్యాంకులు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. రాష్ట్రానికి చెందిన 4 జిల్లాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్​లు పెంచామని చెప్పారు. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని వివరించారు. వారికి కేసీఆర్ కిట్​తో పాటు నగదును అందిస్తున్నామని పేర్కొన్నారు. తక్కువ కాలంలోనే భారతదేశంలోనే.. తెెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. ఈ బహిరంగ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఆరూరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు.. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: అంతకు ముందు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఏనుగల్లులో నైపుణ్య కేంద్రం.. 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు.. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు.

"దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి గుర్తింపు తెచ్చుకున్నారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజనలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది. చక్కని పనితీరు కనబర్చిన 20 గ్రామాల్లో 19 మన రాష్ట్రంలోనే ఉన్నాయి. రెండు త్రైమాసికాలకు సంబంధించి కేంద్రం 3, 4 స్టార్‌ రేటింగ్‌లు ఇచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్​ కింద తెలంగాణకు కేంద్రం ర్యాంకులు ఇచ్చింది. దేశంలో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే రాష్ట్రానికి చెందిన 4 జిల్లాలున్నాయి. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్​లు పెంచాం. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం." - కేటీఆర్, మంత్రి

'దేశంలో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. అందులో 4 రాష్ట్రం నుంచే ఉన్నాయి'

ఇవీ చదవండి:ఎంత పెద్ద నాయకుడైనా.. ఇంట్లో బాస్‌కు భయపడాల్సిందే: కేటీఆర్

దిల్లీకి ఎమ్మెల్సీ కవిత పయనం.. ఈడీ విచారణకు మరో రోజు హాజరుకావాలని యోచన

వీళ్ల రూటే సెపరేటు! రైల్ టికెట్​ కొంటారు.. కానీ ప్రయాణించరు!! ఎందుకో తెలుసా?

Last Updated : Mar 8, 2023, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details