మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ తేజ్యాతండాలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇవరై కుటుంబాలకు చెందిన 100మంది ఈ తండాలో నివసిస్తున్నారు. తండాలో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ... ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు చేసి ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. దసరా సెలవులకు ముందు సక్రమంగానే నడిచిన పాఠశాలలో... అనంతరం హాజరుశాతం తగ్గింది. ఐదు రోజులుగా ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నట్లు తండావాసులు గుర్తించారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుడితో కలిసి ప్రతిరోజూ తొలగించి వెళ్లినప్పటికీ... ఉదయం వచ్చేసరికి మళ్లీ ఉంటున్నాయని ఉపాధ్యాయుడు వేణుమాధన్ తెలిపారు. ఇటీవల పారిశుద్ధ్య కార్మికుడు అనారోగ్యానికి గురి కావడం వల్ల క్షుద్రపూజలపై అనుమానం మరింత బలపడినట్లు చెప్పారు. మూఢనమ్మకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తేజ్యాతండా ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం - kshudra poojalu performed ingovenrment school
ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం సృష్టించిన ఘటన... మహబూబాబాద్ జిల్లా తేజ్యాతండాలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ఐదురోజులుగా పూజలు చేస్తున్నట్లు తండావాసులు గుర్తించారు.

తేజ్యాతండా ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
తేజ్యాతండా ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..