కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ నియంత్రణ టీకాల పంపిణీ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొవిడ్ టీకా వేయించుకున్నారు.
కొవిడ్ టీకా వేయించుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ - MLA Redya Naik latest news
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేటలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కొవిడ్ టీకాల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత మొదటి డోసు టీకా వేయించుకున్నారు. కొవిడ్ నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కొవిడ్ నియంత్రణ టీకా వేయించుకోవాలన్నారు.
MLA Redya Naik
కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారంతా స్వచ్ఛందంగా వచ్చి టీకా వేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా